25, మే 2016, బుధవారం

శైశవ ప్రేమమ్



పీయూష ప్రభావమో... శీతోష్ణ స్వభావమో...

సినిమాల ప్రతపమో... స్నేహితుల బలవంతమో...

టుటోరియల్స్ పుణ్యమో... అసమర్ధుని నైపుణ్యమో.. తెలియదు. కాని,

ప్రాత:సాయంత్రకాలముల తరగతులలో...

సీతాకోకల్లాంటి నా చూపులు.. ఎక్కడెక్కడో తిరిగి,

నీ ముఖపద్మంపై వాలడానికి ప్రతిరోజూ ప్రయత్నిస్తూవుండేవి.




ఊహల్లో సైకిల్ తొక్కుతూ.. ఊళ్ళో తిరిగేవాన్ని,

చూసేస్తావోనని ఒణుకుతు... నీ ఇంటిదాక అనుసరించేవాడిని.
పుస్తకాల్లో, 143వ పేజీ దగ్గర... నీ పేరుని అందంగా రాసుకునేవాని,

నువ్వు చూసినా, పొరపాటున పిలిచినా... ఆరోజంతా మురిసిపోయెవాడిని.
 

ప్రేమో..వ్యామోహమో తెలియదు,
తప్పో.. తప్పదో తేలదు,

వివశమోనిశ్చితమో తెలుసుకోవాలనిపించలేదు.

తెలిసిందంతా.. నిన్ను చూడడం.



నువ్వు అందంగా నవ్వుతావ్... నేను చూసాను.

నువ్వు తల ఒల్లో పెట్టుకొని ఏడుస్తవ్... నేను చూసాను

నువ్వు గట్టిగా చదువుతావ్... నేను చూసాను

నువ్వు గతమై కరిగిపోయావు.. నేను వెనక తిరిగి చుస్తూ మిగిలిపోయాను.




సముద్రంలో కలవాల్సిన ఒక నది..  దారిమధ్యలో ఇంకినట్లు,

కాలం నిన్ను నానుండి, నన్ను నీనుండి కనుమరుగుచేసి,

ఎవరిమంచికోనని ప్రశ్నిస్తే.. నవ్వి,

మళ్ళీచెబుతానంది.

-    arif.tmd



24, అక్టోబర్ 2015, శనివారం

అమ్మచేతి వంట

పండగపూట నువ్వు బిరియాని వండావు,
ఆకలి దాచుకొనిమరీ నేను ఎదురుచూస్తున్నాను.

ఆ...హా... చూస్తుంటేనే.. నోరూరుతుంది,
కాని కంటి ఆకలి చిన్నదైపోయింది...!!

వెచ్చని అన్నంలో వేళ్ళుపెట్టి.. మొదటి ముద్ద తీసుకున్నను,
ప్రపంచం తిరిగి, కోట్లు ఖర్చుచేసినా దొరకని ఆ రుచి,
ఎలా వండగల్గుతావమ్మ ఇంత అద్భుతంగా...!!

ముక్కని అన్నంతో కలిపి, పైన నిమ్మకాయ పిండి రెండో ముద్ద తిన్నాను... అబ్బ... ఏమినా భాగ్యము,
దిన్ని విడిచి దూరంగా బ్రతకాల్సివస్తే....అదీ ఒక బ్రతుకేన?

ఉల్లిపాయలు,మిరపకాయలు,పెరుగు చెట్ని... అన్నిటితో అలా.. తింటూ ఆస్వాదిస్తుంటే.. రోజంతా ఇలానే గడిచిపోతే ఎంత బావుండు అనిపిస్తుందమ్మ...!!!

ఇలా ఊహించుకుంటూ,
రోజు బయట కర్రీస్ కొనుక్కోని వచ్చి,
తిని పడుకుంటున్న అమ్మ.

Arif.TMD

12, డిసెంబర్ 2014, శుక్రవారం

సాహిత్య పోరాటం

క్షమించండి శ్రీ శ్రీ గారూ...
మీరు సైతం.. విశ్వవృస్టికి ధారపోసిన అశ్రువు వౄధ అయిపోయింది. 

వేటూరి గారూ.. 
ఎందుకు వచ్చారు వేణువై భువనానికి?
ఎందుకు వెల్లారు.. గాలియై.. గగనానికి?
అనాధలు లాంటి మాకు.. తల్లి ప్రేమను చూపించే ప్రయత్నం ఎందుకు చేసారు?

 సిరివెన్నెల గారూ... 
వింటున్నారా...చేతనపొందిన స్పందన ధ్వనించు... హృదయ మృదంగ నాదం..?
ఇది చరితలు సైతం చదవని వైనం...
కవితలు సైతం పలకని భవం..
.సరిగమలెరుగని సాహిత్య పోరాటం... 
నా ఆఖరి ఆరాటం. 

తెలుగు సాహిత్యం చచ్చిపోయిందట...
మరి.. చచ్చిన శవాన్ని లేపే ప్రయత్నం నేనెందుకు  చేస్తున్నట్లు?నిజంగా తెలుగు సాహిత్యం చచ్చిందోలేదో నాకు తెలియదు,
కాని.. నా తల్లి పురిటి నొప్పులు వృధా అయ్యాయి..
నాలో.. అప్పుడే జన్మించిన.. సాహిత్యకారుడు.. చంపబడ్డాడు..!!
ఇక రాయనని.. నే రాస్తున్న.. చివరి లేఖ ఇది...
ఆయుషువుండి.. బ్రతకాలనిలేని.. సాహిత్యకారుడి.. తుదిశ్వాస ఇది...!!

-ARIF.TMD




18, జనవరి 2014, శనివారం

ప్రణయ ప్రళయం


శ్వాసించకుండా బ్రతకగలనేమోగాని, నిన్ను ఊహించకుండా మాత్రం ఖచ్చితంగా బ్రతకలేను.

ఊహించడం ఖర్చుతోకూడుకున్నదైతే... బహుషా నేనొక కోటీశ్వరుడను.


నీ గూర్చి రాయాలనిపించినప్పుడల్లా...నేనొక కవిని కానందుకు చింతిస్తాను.

నిన్ను గీద్దామనుకున్నప్పుడల్లా...చిత్రకారులను చూసి ఈర్ష్య పడతాను.

ఏమి చేయగలను? ఎలా చెప్పగలను?


నీ అందమైన ఆకృతిని, ప్రకృతి అందంతో పోల్చి నిన్ను కించపరచలేను.
నీ కనుబొమ్మల్లా ఉండాలని హరివిల్లు నిరంతరం ప్రయత్నించి ఓడిపోవడం గమనిస్తున్నాను. 

సముద్రతీరాన సుర్యోదయం అందంగా వుంటుందని ఎవరో అన్నారు.
నీ నవ్వు లోని అందం గూర్చి తెలియనందుకు వారిపై నాకు జాలి కలిగింది.
సుర్యోదయం ఎదో ఒక్కరోజు మత్రమే బావుంటుందేమో, కాని
నీ నవ్వుని ఆస్వాదించడానికి ఒక్క జీవితం సరిపోదు. 

నీ చూపు చెప్పే ప్రతీమాటా నా మనస్సుకు అర్థమౌతుంది.
ఎంత అద్భుతంగా వుందో మౌనభాష. 

నీ స్పర్శతో నాలోని అణు అణువూ చలించి, మతి భ్రమించింది. కాని
ఎందుకో.. మళ్ళీ మళ్ళీ..అదే కావాలనిపిస్తుంది.

నువ్వు నాజీవితం,
నువ్వు నే సాధించాల్సిన లక్ష్యం, ఆస్వాదించాల్సిన ఆనందం. 

నిన్ను చూడని రోజు చాలు, కాలం ఆగిపోడానికి,
నువ్వు దక్కవన్న ఆలోచన చాలు నేను చచ్చిపోడానికి.
- ARIF.TMD