25, మే 2016, బుధవారం

శైశవ ప్రేమమ్పీయూష ప్రభావమో... శీతోష్ణ స్వభావమో...

సినిమాల ప్రతపమో... స్నేహితుల బలవంతమో...

టుటోరియల్స్ పుణ్యమో... అసమర్ధుని నైపుణ్యమో.. తెలియదు. కాని,

ప్రాత:సాయంత్రకాలముల తరగతులలో...

సీతాకోకల్లాంటి నా చూపులు.. ఎక్కడెక్కడో తిరిగి,

నీ ముఖపద్మంపై వాలడానికి ప్రతిరోజూ ప్రయత్నిస్తూవుండేవి.
ఊహల్లో సైకిల్ తొక్కుతూ.. ఊళ్ళో తిరిగేవాన్ని,

చూసేస్తావోనని ఒణుకుతు... నీ ఇంటిదాక అనుసరించేవాడిని.
పుస్తకాల్లో, 143వ పేజీ దగ్గర... నీ పేరుని అందంగా రాసుకునేవాని,

నువ్వు చూసినా, పొరపాటున పిలిచినా... ఆరోజంతా మురిసిపోయెవాడిని.
 

ప్రేమో..వ్యామోహమో తెలియదు,
తప్పో.. తప్పదో తేలదు,

వివశమోనిశ్చితమో తెలుసుకోవాలనిపించలేదు.

తెలిసిందంతా.. నిన్ను చూడడం.నువ్వు అందంగా నవ్వుతావ్... నేను చూసాను.

నువ్వు తల ఒల్లో పెట్టుకొని ఏడుస్తవ్... నేను చూసాను

నువ్వు గట్టిగా చదువుతావ్... నేను చూసాను

నువ్వు గతమై కరిగిపోయావు.. నేను వెనక తిరిగి చుస్తూ మిగిలిపోయాను.
సముద్రంలో కలవాల్సిన ఒక నది..  దారిమధ్యలో ఇంకినట్లు,

కాలం నిన్ను నానుండి, నన్ను నీనుండి కనుమరుగుచేసి,

ఎవరిమంచికోనని ప్రశ్నిస్తే.. నవ్వి,

మళ్ళీచెబుతానంది.

-    arif.tmd2 వ్యాఖ్యలు:

  1. మిత్రమా ఎలా ఉనావు నీవు రాసిన శైశవ ప్రేమమ్ చాల బాగుంది మామ .

    ప్రత్యుత్తరంతొలగించు