అవకాశం మాకిస్తె, ఆకాశం దించేస్తం
అవరోధం ఏదైనా, ఆశయం సాధిస్తాం.
ఎదురైయ్యె...ప్రతీ సమస్య, ఎదురిస్తెనే తెలిసే కక్ష్య.
చిగురించే...ప్రతీ ఆశ, చివరికదే మన శ్వాస....!
ఆవేశం మాఆయుదం, ఆరాటం మాశాసనం...... సాధిస్థాం, శాసిస్థాం.....!!
ప్రవహించే అలలకు తెలుసు, తప్పక ముగిసేదే తమ పయనం.
శ్రమించే తనువుకు తెలుసు, తప్పదు ఒకరోజు తన మరణం.
జననం,ఖననం మధ్య నీవేగా....నీ జీవితం.
ఆవేశం,ఆశయం మధ్య సాగేదే....ఈ ప్రయాణం.
తడబడని అడుగులు, తనవనని ఆలోచనలు నీవైతే
మరచిన దారిని, తెలుసుకొని, నీవైపు చెరదా.... ఈ విజయం....!!
గడచిన గతముని అడుగు, నువ్వు నువ్వుగా లేని తరుణం.
మరచిన కలలని అడుగు, నీకు నువ్వేగా వున్న త్వరణం.
పిలవదు,కలవదు,నిత్యం తట్టదు ఈ అవకాశం,
అదరకు,బెదరకు, లక్ష్యం మరవకు...ప్రతి నిమిషం.
నిజమైన నిజాయితి, మనసున్న మానవత్వమే నీ గమ్యమైతే
చేరిన గమ్యన్ని, వ్రాయించుకొని, చరిత్రగా చెప్పుకోదా....నీ విజయం....!!
--- Arif.TMD

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి