18, సెప్టెంబర్ 2013, బుధవారం

PROUD to be INDIAN


నాకు జన్మనిచ్చిన ఓ దేశమా..... నా భారతదేశమా,

నా తల్లికి మాతృత్వాన్ని నేర్పావు,
నా తండ్రికి సుసంపదలూ ఇచ్చావు.

నా జగతికి ఒక గుర్తింపునిచ్చావు,
నా జాతికి ఒక లక్ష్యం చూపించావు.

నీ గొప్ప చరిత్రను చూసి... జీవితం పై ఆశ పెరిగింది,
జీవించడానికి కావలసిన ధైర్యం దొరికింది.

ఆశోకుడు,ఆక్బరు, గంభీరాన్ని నెర్పారు,
అంబేద్కరు,నెహ్రు, నాయకత్వన్ని నెర్పారు.

నీ అమరిక ఒక అద్భుతం
నీ విస్తరణ ఒక అమోఘం.

నీ పంచభుతాలను నాకు పంచి, నన్ను నీలో ఒకన్ని చేశావు.

కాలం మారినా, యుగాలు మారినా, నువ్వు మారవు....
అంత గొప్పది నీ ఔనత్యం.

మనషులు మారినా,మనసులు మారినా, నువ్వు మారవు....
అంత విశిస్టమైనది నీ విశ్వం.

సింధు నాగరికతతో జగతికి మూలం చూపిన మన ప్రజలు,తర్వాత రాజులుగా, నాయకులుగా
బానిసలుగా, ఆ తర్వత మూర్ఖులుగా మారారు.
కాని అందరినీ నీ గర్భంలో దాచుకొని కాపాడావు.

అందుకే... 
నాకు జన్మనిచ్చిన ఓ దేశమా..... నా భారతదేశమా,
నీకు పాదాబివందనం.

-- ARIF.TMD


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి