పర్వతాల ప్రక్కన...
పచ్చని పైరుల మధ్యన....
మేఘాలే పైకప్పు గా మారగా....
నిరంతరం తడిమే చల్లని గాలులు,
అప్పుడప్పుడు తడిపే చిరుజల్లుల మధ్యన.....
మదిలో రగిలే ప్రశ్నలకు...
హద్దులు లేని ఆలోచనలకు ,
పరిస్థుతులు వేసే అడ్డంకులకు
ప్రకృతి జవాబులు పలికే సమయాన ......
నేను చూసిన అద్బుతాలు,
నేను అనుభవించిన అనుభూతులు,
నాలో కలిగిన మార్పులు,
నాతొ నేను చెప్పుకున్న మాటలు,
ఇవన్ని నాకు తెలియజేశాయి... నేను నిజంగా జీవిస్తున్నానని .
నేను జీవిస్తున్నది నిజమని .
ఆహరం ,ఆయువు తో పాటు.... ఆలోచనలు, ఆశయాలు మరియు
అద్భుతాలు కోరుకొంటుంది నా జీవితం....
అప్పుడు అర్థమయింది......
జీవిస్తున్నవని తెలుసుకోవడం కాదు.....ఎలా జీవించాలో తెలుసుకోవాలి.
ఇంతలో మా ఫ్రెండ్ నన్ను నిద్రలేపాడు... యాదవ,
btw Good Morning........!!
-- ఆరిఫ్.టీ.యం.డి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి