18, మే 2013, శనివారం

ప్రేమ కోసం


శ్వాసే ఆగిపోయె.... నువ్వు రాని నిమిషమే,
స్వేచ్చే బానిసయ్యే.... అందమైన ప్రేమకే.
లొలోన నాలో ,మనస్సంది నాతో ,
నా నుదుటే నీయదపై... ఉంటే  కలకాలం.
ప్రేమ అంటే నువ్వే     ప్రేమకు రూపం నీవే .
ప్రేమ కొరకే నేనే      ప్రేమ కోసం !!


మన కోసమే ...మధుమాసమే    నీతో నన్నే , నాతో నిన్నే
ఊహించెలె  నా ఊహలే....లోకమంతా నువ్వు నేనే .
మదిలోన రేగే....ఓ చిన్ని భయమే...ఓ  నా  ప్రేమే ఓడి , నా ప్రాణం పోయే .
నువ్వు లేని లోకం      నాకు అది ఒక శాపం
నేనూ విడిచా లోకం     ప్రేమ కోసం!!

ప్రేమ అంటే నువ్వే     ప్రేమకు రూపం నీవే .
ప్రేమ కొరకే నేనే      ప్రేమ కోసం !!



నీలో వ్యధే....నాకో విధే....వివరించే లే మన ప్రేమే..
విడిపోవడం....వదిలేయడం  తెలియనిదే మన ప్రేమ .
ప్రాణాల కన్నా... నువ్వే లే మిన్న...ఓ..నువ్వే లేని నిమిషం
 నేనూ  నిర్జీవం.. !!
ప్రేమ అంటే  జీవం    ప్రేమ కోసం జీవితం
ప్రేమ వుంటే స్వర్గం   ప్రేమ కోసం !!

ప్రేమ అంటే నువ్వే     ప్రేమకు రూపం నీవే .
ప్రేమ కొరకే నేనే    ప్రేమ కోసం!!



3 కామెంట్‌లు: