శ్వాసే ఆగిపోయె.... నువ్వు రాని నిమిషమే,
స్వేచ్చే బానిసయ్యే.... అందమైన ప్రేమకే.
లొలోన నాలో ,మనస్సంది నాతో ,
నా నుదుటే నీయదపై... ఉంటే కలకాలం.
ప్రేమ అంటే నువ్వే ప్రేమకు రూపం నీవే .
ప్రేమ కొరకే నేనే ప్రేమ కోసం !!
మన కోసమే ...మధుమాసమే నీతో నన్నే , నాతో నిన్నే
ఊహించెలె నా ఊహలే....లోకమంతా నువ్వు నేనే .
మదిలోన రేగే....ఓ చిన్ని భయమే...ఓ నా ప్రేమే ఓడి , నా ప్రాణం పోయే .
నువ్వు లేని లోకం నాకు అది ఒక శాపం
నేనూ విడిచా లోకం ప్రేమ కోసం!!
ప్రేమ అంటే నువ్వే ప్రేమకు రూపం నీవే .
ప్రేమ కొరకే నేనే ప్రేమ కోసం !!
నీలో వ్యధే....నాకో విధే....వివరించే లే మన ప్రేమే..
విడిపోవడం....వదిలేయడం తెలియనిదే మన ప్రేమ .
ప్రాణాల కన్నా... నువ్వే లే మిన్న...ఓ..నువ్వే లేని నిమిషం
నేనూ నిర్జీవం.. !!
ప్రేమ అంటే జీవం ప్రేమ కోసం జీవితం
ప్రేమ వుంటే స్వర్గం ప్రేమ కోసం !!
ప్రేమ అంటే నువ్వే ప్రేమకు రూపం నీవే .
ప్రేమ కొరకే నేనే ప్రేమ కోసం!!