18, జనవరి 2014, శనివారం

ప్రణయ ప్రళయం


శ్వాసించకుండా బ్రతకగలనేమోగాని, నిన్ను ఊహించకుండా మాత్రం ఖచ్చితంగా బ్రతకలేను.

ఊహించడం ఖర్చుతోకూడుకున్నదైతే... బహుషా నేనొక కోటీశ్వరుడను.


నీ గూర్చి రాయాలనిపించినప్పుడల్లా...నేనొక కవిని కానందుకు చింతిస్తాను.

నిన్ను గీద్దామనుకున్నప్పుడల్లా...చిత్రకారులను చూసి ఈర్ష్య పడతాను.

ఏమి చేయగలను? ఎలా చెప్పగలను?


నీ అందమైన ఆకృతిని, ప్రకృతి అందంతో పోల్చి నిన్ను కించపరచలేను.
నీ కనుబొమ్మల్లా ఉండాలని హరివిల్లు నిరంతరం ప్రయత్నించి ఓడిపోవడం గమనిస్తున్నాను. 

సముద్రతీరాన సుర్యోదయం అందంగా వుంటుందని ఎవరో అన్నారు.
నీ నవ్వు లోని అందం గూర్చి తెలియనందుకు వారిపై నాకు జాలి కలిగింది.
సుర్యోదయం ఎదో ఒక్కరోజు మత్రమే బావుంటుందేమో, కాని
నీ నవ్వుని ఆస్వాదించడానికి ఒక్క జీవితం సరిపోదు. 

నీ చూపు చెప్పే ప్రతీమాటా నా మనస్సుకు అర్థమౌతుంది.
ఎంత అద్భుతంగా వుందో మౌనభాష. 

నీ స్పర్శతో నాలోని అణు అణువూ చలించి, మతి భ్రమించింది. కాని
ఎందుకో.. మళ్ళీ మళ్ళీ..అదే కావాలనిపిస్తుంది.

నువ్వు నాజీవితం,
నువ్వు నే సాధించాల్సిన లక్ష్యం, ఆస్వాదించాల్సిన ఆనందం. 

నిన్ను చూడని రోజు చాలు, కాలం ఆగిపోడానికి,
నువ్వు దక్కవన్న ఆలోచన చాలు నేను చచ్చిపోడానికి.
- ARIF.TMD